బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసేదిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా దారు శ్రీనివాసరాజు గురువారం బాసరకు వచ్చా రు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి అధి కారులతో సమీక్ష నిర్వహించారు. పునర్నిర్మాణ దా త సూరపనేని సునంద్ కూడా ఆయన వెంట ఉన్నా రు. బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు చేశారు. ఈవో కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ, దేవాదాయ శాఖ అధికారులతో శ్రీనివాసరాజు సమీక్ష నిర్వహించారు. పనుల్లో జాప్యం లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.


