క్రీడా నిధులతో ఆటలు..! | - | Sakshi
Sakshi News home page

క్రీడా నిధులతో ఆటలు..!

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

మైదానాల్లేని కళాశాలలు, స్కూళ్ల నిధుల్లో కోత ఆటస్థలాలు, క్రీడా మైదానాలు లేని స్కూళ్ల వర్గీకరణ క్రీడా పరికరాలు సరే.. వ్యాయామ ఉపాధ్యాయులు ఏరి ఉమ్మడి జిల్లాలోని 43 జూనియర్‌ కళాశాలల్లో ఒకే ఫిజికల్‌ డైరెక్టర్‌

మంచిర్యాలఅర్బన్‌: ఉమ్మడి జిల్లాలో ఆట మైదానాలు లేని పాఠశాలలు, కళాశాలలకు క్రీడా నిధుల్లో కోత విధించారు. క్రీడా మైదానాలు లేక ప్రభుత్వం విడుదల చేసే క్రీడా నిధులు సద్వినియోగం కావడం లేదని భావించిన అధికారులు తగ్గించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలు, శారీరక విద్యను ప్రోత్సహించడానికి 2026–27 విద్యాసంవత్సరం క్రీడా నిధులను సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆటస్థలం ఉన్న, లేని పాఠశాలలు, కళాశాలలను వర్గీకరిస్తూ నిధులు కేటాయించారు.

వర్గీకరణ ఇలా..

ఉమ్మడి జిల్లాలో 2895 పాఠశాలలు, 47 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2,466 పాఠశాలలు, 43 కళాశాలల్లో ఆటస్థలాలు ఉన్నట్లు వర్గీకరించారు. 429 పాఠశాలలు, 4జూనియర్‌ కళాశాలల్లో క్రీడామైదానాలు లేనట్లు లెక్క తేల్చారు. ఆటస్థలం ఉన్న ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.10వేలు, జూనియర్‌ కళాశాలకు రూ.25వేలు, ఆటస్థలం లేని ప్రాథమిక పాఠశాలకు రూ.4వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.7వేలు, ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలకు రూ.15వేల చొప్పున కేటాయించారు.

వినియోగం ఇలా..

క్రీడా నిధులను ఆట స్థలాల నిర్వహణ, ఆట వస్తువుల కొనుగోలుకు ఉపయోగించాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయికి తగినట్లుగా క్యారమ్‌, చెస్‌బోర్డులు, ఫుట్‌బాల్స్‌, వాలీబాల్స్‌, క్రికెట్‌ కిట్లు, తాడు, బ్యాడ్మింటన్‌ తదితర ఆట పరికరాలు కొనుగోలు చేయనున్నారు. పాఠశాల ఆవరణలో ఆటస్థలాన్ని శుభ్రం, సమం చేయడం, సురక్షితంగా సిద్ధం చేయ డం, క్రీడాపోటీల నిర్వహణ, రిజిష్టర్‌ నిర్వహణకు ఖర్చుచేయాల్సి ఉంటుంది.

ఆటస్థలాలు లేనివి..

మంచిర్యాలలో 642 పాఠశాలల్లో ఒక్కటంటే ఒకే ఉన్నత పాఠశాలలో ఆటస్థలం లేనట్లు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్‌లో 198 పాఠశాలలు, కళాశాలల్లో ఆటస్థలాలు లేనట్లు నిర్ధారించారు. ప్రైమరీలో 163, అప్పర్‌ ప్రైమరీలో 16, హైస్కూల్‌లో 18, జూని యర్‌ కళాశాలల్లో 1, నిర్మల్‌లో 78 బడుల్లో క్రీడా మై దానాలు లేకుండా పోయా యి. ప్రైమరీలో 64, అప్ప ర్‌ ప్రైమరీలో 5, ఉన్నత పాఠశాలల్లో 7, జూనియర్‌ కళాశాలల్లో 2, ఆసిఫాబాద్‌లో 156 పాఠశాలల్లో ఆటస్థలాలు లేకుండా పోయాయి. ఇందుల్లో ప్రైమరీ పాఠశాలల్లో 133, అప్పర్‌ ప్రైమరీలో 12, ఉన్నత పాఠశాలల్లో 10, జూనియర్‌ కళాశాల 1లో క్రీడా మైదానాలు లేవని గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement