బెల్లంపల్లి: గంజాయి కేసులో యువకుడిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో కె.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై రామకృష్ణ ఆదివారం జాతీయ రహదా రి పక్కన వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సల్గుపల్లికి చెందిన గోమాస ప్రకాష్ వద్ద 200 గ్రాముల గంజాయి లభించింది. మహా రాష్ట్రలోని బల్లార్షాలో తక్కువ ధరకు కొనుగో లు చేసి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి బైక్, గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


