నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు మెరుగై న విద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ ప బ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ఏర్పాటుకు ప్రాధాన్యమి స్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎని మిది పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ మేరకు నిఽ దులు కేటాయిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూ.83.19 కోట్లు కేటాయించారు. ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసన ఫలి తాలను మెరుగుపరిచేలా నాణ్యమైన, సమగ్ర విద్యా వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి చేస్తా రు. ప్రస్తుతం ఉన్న జెడ్పీహెచ్‌ఎస్‌లు, మోడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు.
ప్రభుత్వ విద్యకు కొత్త రూపు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల ను మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచడం ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశం. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, సురక్షితమైన పాఠశాల వాతావరణం అందించడంపై దృష్టి సారించనున్నారు.
విద్యార్థుల సమగ్ర వికాసం
పాఠ్యపుస్తకాల బోధనకే పరి మితం కాకుండా విద్యార్థుల మేధో, శారీరక, మానసిక, సా మాజిక, సాంస్కృతిక వికాసానికి వేదికగా నిలువనున్నా యి. క్రీడలు, కళలు, సైన్స్, సాంకేతికత, తదితర రంగా ల్లో విద్యార్థుల ప్రతిభ ను వెలి కితీసేలా అవకాశాలు కల్పించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు ప్ర త్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. నాణ్యమై న విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు ప్రభు త్వ పాఠశాలల్లోనే అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులపై విద్యా ఖర్చుల భారం తగ్గనుంది.
జిల్లా పాఠశాల నిధులు
(రూ.కోట్లలో) కుమురంభీం ఆసిఫాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ 8.40
కాగజ్‌నగర్ జెడ్పీహెచ్‌ఎస్ 10.09
మందమర్రి మోడల్ స్కూల్ 10.70 మంచిర్యాల కాసిపేట మోడల్ స్కూల్ 10.30
సీతారాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్ 12
నిర్మల్ కుంటాల మోడల్ స్కూల్ 9
నర్సాపూర్(జీ) జెడ్పీహెచ్‌ఎస్ 12.50
ఆదిలాబాద్ యాపల్‌గూడ జెడ్పీహెచ్‌ఎస్ 10.20
ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన
పాఠశాలలు, కేటాయించిన నిధులు


