విద్యార్థినులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

బెల్లంపల్లి: విద్యార్థినులకు నాణ్యమైన పౌష్టికా హారాన్ని అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీప క్‌ ఆదేశించారు. మంగళవారం బెల్లంపల్లి క స్తూర్బా బాలికల విద్యాలయాన్ని సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల కోసం వండిన భోజనా న్ని పరిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థిణుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. అంతకుముందు భో జనశాల నిర్మాణ పనులు పరిశీలించారు. ఆ తర్వాత శాంతి గని బస్తీ శివారు ప్రాంతంలో చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకుల రెసిడెన్షియల్‌ విద్యాలయం భవన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వేను పరిశీలించారు. భూవివాదాల సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రభుత్వం భూముల రీ సర్వేను చేపట్టిందని పేర్కొన్నా రు. భూముల రీ సర్వేను రైతులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా సర్వే చేయాలని అధికారులను ఆదేశించా రు. ఆయన వెంట తహసీల్దార్‌ కృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement