● ఉమ్మడి జిల్లాలో ఎంపీ ల్యాడ్స్‌ వినియోగంలో జాప్యం ● పెద్దపల్లిలో 11శాతం, ఆదిలాబాద్‌లో 24.3శాతం | - | Sakshi
Sakshi News home page

● ఉమ్మడి జిల్లాలో ఎంపీ ల్యాడ్స్‌ వినియోగంలో జాప్యం ● పెద్దపల్లిలో 11శాతం, ఆదిలాబాద్‌లో 24.3శాతం

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

● ఉమ్మడి జిల్లాలో ఎంపీ ల్యాడ్స్‌ వినియోగంలో జాప్యం ● పెద్దపల్లిలో 11శాతం, ఆదిలాబాద్‌లో 24.3శాతం

లోకసభ పరిధి లోకసభ పరిధి

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే అన్నింటా వెనుకబడినట్లే నిధులు వినియోగంలోనూ వెనుకబడింది. లోక్‌సభ సభ్యులకు ఎంపీ ల్యాడ్స్‌(లోకల్‌ ఏరియా డెవలప్‌మెంటు స్కీం) కింద ఏడాదికి రూ.5కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇందులో నూ ప్రతీ ఆరు నెలలకోసారి రెండు వాయిదాల్లో రూ.2.5 కోట్ల చొప్పున మంజూరు చేస్తారు. వీటిని తమ నియోజకవర్గాల్లో ఎంపీలు మౌలిక వసతులు విద్య, వైద్యారోగ్యం, రోడ్డు, రవాణా, ఆస్తుల కల్ప న తదితర అభివృద్ధి పనులకు ప్రతిపాదించవచ్చు. ఈ నిధులను నేరుగా ఎంపీలకే ఇవ్వకుండా జిల్లా అధికారులు, అందులోనూ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పూర్తి చేసే బాధ్యత సంబంధిత శాఖలకు అప్పగిస్తుంది. ఎంపీలు ప్రతిపాదించిన చోట్ల కనీసం రూ.25లక్షల పనులకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ జనాభా ఉన్న చోట్ల కనీసం 15శాతం, ఎస్టీలు ఉన్న చోట్ల 7.5శాతం చొప్పున మొత్తం నిధుల్లో ఖర్చు చేయాలి. గత రెండేళ్లలో విడుదలైన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్లో రెండు లోక్‌సభ స్థానాలు ఆదిలాబాద్‌, పెద్దపల్లి పరిధిలో తక్కువ శాతం ఖర్చు చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ 11శాతమే ఖర్చు చేయగా, ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ 24.3శాతం ఖర్చు చేశారు. ఇద్దరు ప్రజాప్రతినిధులూ నిధుల ఖర్చులో వెనుకబడిపోయారు. ప్రతిపాదిత పనులు సకాలంలో పూర్తి కాక ఖర్చు పూర్తి స్థాయిలో జరగలేదు.

పెండింగ్‌లోనే పనులు

ఎంపీలు తమ లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనులు ప్రతిపాదించినప్పటికీ సకాలంలో పూర్తి కావడం లేదు. అధికంగా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పనుల పురోగతిని బట్టి నిధుల చెల్లింపులు జరుగుతాయి. క్షేత్రస్థాయిలో ఆశించిన మేర పనులు జరగకపోవడంతో చెల్లింపులు జరగడం లేదు. కొన్నిసార్లు సంబంధిత కాంట్రాక్టర్లు పను ల పూర్తిలో జాప్యం చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ పరిధిలో ఇప్పటి వరకు తొమ్మిది పనులే పూర్తి కాగా, మరో 62పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఆదిలాబాద్‌ ఎంపీ పరిధిలో మొత్తం 277పనులు ప్రతిపాదనలో ఉండగా, 197 వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 80పనులే పూర్తయ్యాయి. ఎంపీ నిధుల ఖర్చులో అధికంగా కుల, సామాజిక భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీరు(బోర్‌ వెల్స్‌), రోడ్లు, తదితర పనులకు కేటాయిస్తున్నారు.

అంశం పెద్దపల్లి ఆదిలాబాద్‌

కేటాయింపు రూ.14.8కోట్లు రూ.14.7కోట్లు

మొత్తం పనులు 71 277

పనులు పూర్తయినవి 9 80

ఖర్చు చేసింది రూ.1.6కోట్లు రూ.3.57కోట్లు

ఖర్చు చేయాల్సింది రూ.13.2కోట్లు రూ.11.12కోట్లు

పురోగతిలో ఉన్న పనులు 62 197

నిధుల ఖర్చు 11శాతం 24.3శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement