నస్పూర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు అరెస్ట్‌కు నిరసనగా సీసీసీ నస్పూర్‌లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం, అక్రమ అరెస్టులకు పా ల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా వి రుద్ధమని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశా రు. నాయకులు పానుగంటి చందు, నస్పూర్ జోన్ అధ్యక్షుడు చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి పొన్నవేని సదయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
చెన్నూర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులను ప్రొత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో తాము కాంగ్రెస్ నాయకులపై దాడి చేస్తే దేశంలో హస్తం పార్టీ ఉంటుందా? ఆలోచించుకోవాలని సూచించారు.


