దండేపల్లి: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. మండలంలో ని గూడెం గోదావరినది ఒడ్డున రూ.12కోట్లతో చేపట్టిన పుష్కరఘాట్లు, ఇతర అభివృద్ధి పనుల నిర్మాణాలకు మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూడెం గోదావరి నదికి పుష్కర స్నానాల కోసం సుమారు 15లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పుష్కర ఘాట్లు, వాష్‌రూంలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి తెలంగాణ అ న్నవరంగా తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. డీసీపీ భాస్కర్ ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


