అనామలీస్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

అనామలీస్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నో మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్లకు భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముసాయిదా ఓటరు జాబితా, జిల్లాల వారీగా గుర్తించిన మ్యాపింగ్‌ కాని ఓటర్లు, అనామలీస్‌ వివరాలు, నోటీసులు జారీ, తదనంతరం విచారణ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 1,70,967 మ్యాపింగ్‌ కాని, అనామలీస్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రకళ, డీఆర్వో మోతిరామ్‌, ట్రైనీ కలెక్టర్‌ విలాయత్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement