నస్పూర్: అప్పుడే పుట్టిన శిశువు నుంచి 16 సంవత్సరాలు పూర్తయ్యే వరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని జిల్లా వైద్యాధికారి నరేందర్‌రాథోడ్ అన్నారు. బుధవారం ఆయన నస్పూర్‌లోని తాళ్లపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులు, రిజిష్టర్లు, వ్యాధి నిరోధక టీకాల పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. తల్లులతో మాట్లాడారు. పిల్లలకు టీకాలు ఇచ్చే సందర్భంలో తల్లుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. టీకాలు ఇచ్చిన వెంటనే పిల్లలను ఇంటికి పంపించకుండా అరగంట సేపు ఆరోగ్య కేంద్రంలో ఉంచాలని తెలిపారు. టీకా వివరాలను ఎప్పటికప్పుడు యూ విన్ పోర్టల్‌లో నమోదు చేయాలని అన్నారు. హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, ఏఎ న్‌ఎం స్వరూపరాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


