రామకృష్ణాపూర్:రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ ఫేజ్–2 కోసం సేకరించాల్సిన అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా అటవీపెంపకం చేపట్టేందుకు ప్రతిపాదించిన భూమిని బుధవారం అటవీ, సింగరేణి అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. అటవీ సంరక్షణాధికారి శాంతారామ్, జిల్లా అటవీశాఖ అధికారి రాహూల్ కిసాన్ జాదవ్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం 366 హెక్టార్లలో మట్టి గుణాలు, నీటి లభ్యత, రవాణా సౌకర్యాలు, భవిష్యత్ అటవీ అభివృద్ధి అవకాశాలను పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, పర్యావరణ నిబంధనలను పాటిస్తూ తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. గనుల విస్తరణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ఓసీ పనులు చేపడుతామని సింగరేణి అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో సర్వేశ్వర్, ఎఫ్‌ఆర్వో రత్నాకర్, ఏరియా ఎస్‌వోటు జీఎం ప్రసాద్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, డీజీఎం (సర్వే)దేశాయ్, ఎన్విరాన్‌మెంట్ అధికారి వెంకటరెడ్డి, ఎస్‌ఎస్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


