శివ్వారంలో పైపులైన్‌ వేలంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

శివ్వారంలో పైపులైన్‌ వేలంపై విచారణ

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

జైపూర్‌: మండలంలోని శివ్వారంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గ్రామంలో గోదావరి నది నుంచి ప్రజలకు తాగునీటికోసం నిర్మించిన మిషన్‌ భగీరథ పైపులైన్‌ను అక్రమంగా సాగునీటికోసం వేలం వేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు శనివారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వెంకటేశ్వర్‌, డిప్యూటీ ఈఈ కిరణ్‌, ఎంపీడీవో సత్యనారాయణతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ పరిశీలించారు. ప్రజలకు తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన పైపులైన్‌ను సాగునీటికోసం వేలం పాట నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీపతి బాపురావు, ఏఈ రాజమల్లయ్య, సర్పంచ్‌ అంజన్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి సృజన, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement