మంచిర్యాలరూరల్(హాజీపూర్): ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయం, గుడిపేటలోని ఎంజేపీ పీఎంశ్రీ బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, నంనూర్‌లోని అర్బన్ గురుకుల బాలుర పాఠశాలలను శనివారం హాజీపూర్ మండల ప్రత్యేకాధికారి, డీఆర్‌డీవో కిషన్ తనిఖీ చేశా రు. తరగతి, వసతి, వంట గదులు, భోజన శాలలు, మరుగుదొడ్లు, పాఠశాలల పరిశీలించి పలు సూచనలు చేశారు. పరిశుభ్రమైన వాతా వరణాన్ని కలిపిస్తూ విద్యార్థులకు చక్కని బోధ న అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సాయివెంకటరెడ్డి, ఏఈవో తిరుపతిరెడ్డి, ఆయా ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.


