ఐకే1ఏ, ఐకే–ఓసీపీలో పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఐకే1ఏ, ఐకే–ఓసీపీలో పర్యటన

Apr 12 2026 2:36 AM | Updated on Apr 12 2026 2:36 AM

జైపూర్‌: మండలంలోని ఇందారం ఐకే1ఏ, ఐకే– ఓసీపీ గనులపై శనివారం బెల్లంపల్లి రీజియన్‌ సేఫ్టీ జీఎం కె.రఘుకుమార్‌ పర్యటించారు. ఐకే–గ్రూపు ప్రాజెక్టు అధికారి ఏవీ.రెడ్డితో కలిసి ముందుగా ఐకే1ఏలో కొనసాగుతున్న 3వ సీమ్‌లో ఉత్పత్తి తీరు తెన్నులు పరిశీలించారు. 2వ సీమ్‌లో త్వరలో ఉత్పత్తి ప్రారంభించేలా చేపడుతున్న అభివృద్ధి పనులు, వెంటిలేషన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఐకే ఓసీపీలో రక్షణా ప్రమాణాలపై తనిఖీ చేపట్టారు. డ్రిల్లింగ్‌, బ్లాస్టింగ్‌ నిబంధనలు ప్రకారం స్టేఫ్టీ ప్రమాణాలకు లోబడి జరుగుతుందా లేదా అని పరిశీలించారు. అనంతరం గనిపై మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని నిర్వహించారు. ఏరియా సేఫ్టీ అధికారి విజయ్‌కుమార్‌, ఐకే ప్రాజెక్టు మేనేజర్‌ నాగన్న, మేనేజర్‌ ఆపరేషన్స్‌ శంకర్‌, ఫిట్‌ ఇంజనీర్‌ భీమన్న, బ్లాస్టింగ్‌ ఇన్‌చార్జి కిరణ్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement