శ్రీరాంపూర్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం నస్పూర్‌కు రానున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12:30గంటలకు నస్పూర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. క్యాతనపల్లి మున్సిపల్ పాలకవర్గ సభ్యులను సన్మానిస్తారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఉదయం 11:30 గంటలకు కేటీఆర్ గుడిపేటలోని మెడికల్ కాలేజీని సందర్శిస్తారని, అక్కడి నుంచి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు ఇంట్లో తేనేటి విందుకు హాజరై అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు క్యాతన్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహానికి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్.విజిత్‌రావు, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, నాయకులు వంగ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
37మంది
ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు బదిలీ
మంచిర్యాలక్రైం: జిల్లాలోని 37మంది ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు బదిలి అయినట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నందగోపాల్ తెలిపారు. మంచిర్యాల సర్కిల్ నుంచి 10 మంది, బెల్లంపల్లి సర్కిల్ నుంచి 8మంది, చెన్నూర్ సర్కిల్ నుంచి ఏడుగురు, లక్సెట్టిపేట సర్కిల్ నుంచి ఏడుగురు, లిక్కర్ డిపో నుంచి ఇద్దరు, జిల్లా టాస్క్‌ఫోర్స్ నుంచి ముగ్గురు బదిలీ అయ్యారని పేర్కొన్నారు. వీరి స్థానాల్లో వివిధ జిల్లాల నుంచి బదిలీపై వచ్చినట్లు తెలిపారు.


