కాసిపేట(బెల్లంపల్లి): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం బెల్లంపల్లి కేజీబీవీలో నిర్మించిన ఆధునిక సదుపాయాలతో కూడిన ల్యాబ్, తరగతి గదులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.2.30కోట్లతో ల్యాబ్, తరగతి గదుల్లో మెరుగైన విద్య వాతావరణాన్ని కల్పించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో యాదయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్, సర్పంచ్‌లు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


