బస్సు టైర్ కింద పడి ప్రయాణికుడి మృతి
ఆదిలాబాద్‌రూరల్: మండల పరిధిలోని బెల్లూరి గ్రామానికి చెందిన అంచెట్టి స్వామి (42) బస్సులో నుంచి అదుపు తప్పి కింద పడి ఆదివారం రాత్రి మృతి చెందాడు. గ్రామానికి చెందిన స్వామి, తన భార్య మమతతో కలిసి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. ఈ క్రమంలో స్వామికి వాంతులు వస్తున్నాయని డ్రైవర్ వద్దకు వెళ్లి చెప్పగా డోర్ వద్ద నిలబడాలని ఆయన సూచించాడు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సు నిలపకుండానే డోర్ ఓపెన్ చేయడంతో తన భర్త అదుపు తప్పి కింద పడినట్లు మమత తెలిపారు. బస్సు వెనుక టైర్ స్వామిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బిక్‌నూర్ సమీపంలోని జంగంపల్లి శివారు జాతీయ రహదారి 44పై ఈ ఘటన చోటు చేసుకుంది. అజాగ్రత్తగా వ్యవహరించిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని బిక్‌నూర్ పోలీసులకు మృతుడి భార్య మమత ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు పేర్కొన్నారు.


