జాతీయ స్థాయి క్రీడా పోటీలు
మందమర్రిరూరల్: పట్టణంలోని కార్మెల్ హైస్కూల్ అకాడమీలో సోమవారం జాతీయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. రెండ్రోజులపాటు నిర్వహించే పోటీలను బిషప్ జోసఫ్ తచ్చా, కార్మెల్ అకాడమీ డైరెక్టర్ జేవి యర్ రెక్స్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించా రు. వాలీబాల్, ఖోఖో, బాస్కెట్‌బాల్, వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం పోటీల్లో విద్యార్థులు పోటీ పడ్డారు. పోటీలకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 30 పాఠశాలల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రొఫెసర్ ప్రాన్సిస్ జేవియర్, ప్రొఫెసర్ దూసి రవిశేఖర్, కాంచనపల్లి రజిత తదితరులు ఉన్నారు.


