రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
చెన్నూర్‌రూరల్: మండలంలోని కత్తెరసాల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమ్మరి యోగి(సాత్విక్)(12) మృతిచెందాడు. అతడి తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య తన కుమారుడు యోగితో కలిసి మోటార్‌సైకిల్‌పై చెన్నూర్ మండలం చెల్లాయిపేట గ్రామంలో సోమవారం వివాహానికి హాజరయ్యాడు. ఆలుగామకు తిరిగి వెళ్తున్న క్రమంలో కత్తెరసాల గ్రామం వద్దకు రాగానే చెన్నూర్ నుంచి ఆస్నాద వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో మోటార్‌సైకిల్‌పై ఉన్న ఇద్దరూ కిందపడ్డారు. యోగికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెరందాడు. రాజయ్యకు స్వల్ప గాయాలు కాగా చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, యోగి జైపూర్‌లోని గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదవుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్‌రావు తెలిపారు.


