మభ్యపెట్టి.. నగలతో ఉడాయించి..
కాగజ్‌నగర్‌టౌన్: బంగారం, వెండికి పూత పూస్తామని మభ్య పెట్టి ఓ మహిళ నుంచి నగలు అపహరించిన ఘటన ఘటన సోమవారం కాగజ్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో గల వీఐపీ స్కూల్ సమీపంలో ఇద్దరు మహిళలు వెండి, బంగారం ఆభరణాలకు పూత పూస్తాం అంటూ కాలనీకి చెందిన సంధ్య వద్దకు వెళ్లారు. బంగారం పూత పూస్తామని చెప్పి చెవి కమ్మలు, నెక్లెస్ తీసుకున్నారు. బాధితురాలిని బురిడీ కొట్టించి నగలతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయమై కాగజ్‌నగర్ పోలీసులను సంప్రదించగా.. నగలు అపహరించిన విషయం వాస్తవమేనని.. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


