
ఇళ్ల కూల్చివేత అడ్డగింత
కాసిపేట: బెల్లంపల్లి మండలం సోమగూడెం శివారులో ఇళ్ల కూల్చివేతను బాధితులు, గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. సర్వేనంబర్ 3పైకి 3/9లో 2.30 ఎకరాల భూమి తమదని కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లారు. నిర్మాణాలు తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీస్ సిబ్బంది సహాయంతో కోర్టు సిబ్బంది జేసీబీతో తొలగించేందుకు రాగా బాధితులు, గ్రామస్తులు అడ్డగించారు. 35ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, నోటీస్‌లు అందివ్వని 13మంది నిర్మాణాలు కూల్చివేతకు రావడం ఏంటని ప్రశ్నించారు. కోర్టు సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిరోజులు గడువు ఇవ్వాలని, కోర్టు, అధికారులను సంప్రదించే అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో చేసేదేమిలేక త్వరలో సమస్య పరిష్కరించుకోవాలని సూచించి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముత్తె భూమయ్య, కుక్క రాంచందర్, దూడం మహేష్, జైన శ్రీనివాస్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.