
ఈవ్‌టీజింగ్ కేసులతో భవిష్యత్ నాశనం
మంచిర్యాలక్రైం: ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి కేసులు నమోదైతే భవిష్యత్ నాశనమవుతుందని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో సోమవారం యాంటీర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌పై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రయాస పడుతున్నారని, కొందరు విద్యార్థులు కన్నవారి ఆశలను అడియాశలు చేస్తున్నారని అన్నారు. ఒక్కసారి పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు రావాలని తెలిపారు. ర్యాగింగ్ ఘటనలపై 100డయల్, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సీఐ ప్రమోద్‌రావు, మెడికల్, నర్సింగ్ కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు.