
మూడేళ్లుగా ఇబ్బంది పెడుతున్నారు..
మేము ఎస్సీ కులస్తులం. నెన్నెలలో సర్వే నంబరు 671/11లో భూమిని చిప్పకుర్తి మల్లేష్ 4 ఎకరాలు, రాజపోషం 4 ఎకరాలు గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. పట్టా పాసుపుస్తకం, పంట లోను తీసుకుంటున్నాం. గత మూడేళ్లుగా కుశ్నపల్లి రెంజీ పరిధి నెన్నెల అటవీ అధికారులు పంటను ధ్వసం చేస్తున్నారు. రెండు బావులు కూడా తవ్వుకున్నాం. ఆయిల్ ఇంజన్ అమర్చుకుంటే అది కూడా ఎత్తుకెళ్లారు. కంచె వేసుకుంటే తొలగించారు. అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మాకు న్యాయం చేయండి. అటవీ భూమి కూడా కాదు. అన్ని పత్రాలు ఉన్నా వేసుకున్న పంటను తీసేస్తున్నారు.
– చిప్పకుర్తి మల్లేష్, రాజం, నెన్నెల