
ఓపీఎస్ విధానం అమలు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: సీపీఎస్ విధానం రద్దు చేయాలని, ఓపీఎస్‌ను విధానం అమలు చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ ఉపాధ్యాయ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధరణికోట వేణుగోపాల్, సూరినేని గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపర్చారని, రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదని తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త సురేష్, రాజేశ్వర్‌రావు, సుధీర్, లక్ష్మినారాయణ, బి.శ్రీనివాస్, సాగర్, రామ్మోహన్‌రావు, లక్ష్మణ్, కొంకశ్రీను, రవి, సత్యేంద్రకుమార్, రమేష్, బుచ్చన్న, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ రద్దు చేయాలి
మంచిర్యాలఅర్బన్: సీపీఎస్‌ను రద్దు చేయాలని డి మాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. డివిజ న్ కేంద్రాల్లో జీవో 28 పత్రాలు దహనం చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్, తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, రవికుమార్, జిల్లా బాధ్యులు అశోక్, సమ్మయ్య, నాగేందర్, రమేష్ పాల్గొన్నారు.