
గణేష్ ఉత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష
పాతమంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాల్లో భద్రత చర్యలపై ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు సమీక్షించారు. శనివారం రాత్రి ఆయన నివాసంలో పోలీసు, విద్యుత్, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో కుండా భద్రత చర్యలు చేపట్టాలని అన్నారు. గణేష్ చతుర్థి మొదలుకుని నిమజ్జనం వరకు మండపాల వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని, కరెంటు వైర్ల కింద ఉండే మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించాలని తెలిపారు.