
ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవర్ల నిరసన
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రైవర్లకు కాకుండా కాంట్రాక్టు డ్రైవర్లకు డ్యూటీలు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శాశ్వత డ్రైవర్లు ఉండగా కాంట్రాక్టు డ్రైవర్లతో బస్సులు నడిపించడాన్ని తప్పుబట్టారు. ఆర్టీసీ డ్రైవర్లపై అధిక పనిభారం మోపుతున్నారని ఆరోపించారు. ఎనిమిది గంటల పని బదులు 12గంటలు చేయిస్తూ ఓటీ ఎంత కట్టిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రతీ డ్రైవర్ టిమ్ చేయాలని ఒత్తిడి తేవడం సరికాదన్నారు. మంచిర్యాల డిపోలో 50 ఏళ్లు పైబడి ఉన్నవాళ్లేనని, టిమ్స్ చేయించటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.