
పోడు సమస్య పరిష్కరించాలి
నెన్నెల: పోడు భూములు సాగులో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇచ్చి సమస్య పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. గత 40ఏళ్లుగా సాగులో ఉన్నా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోంద ని ఆరోపించారు. పోడు సమస్య పరిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షుడు అంగలి శేఖర్ ఆధ్వర్యంలో శనివారం నెన్నెల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ నెన్నెల శివారు సర్వే నంబర్ 671, 672లో సాగు చేసుకుంటున్న వారిని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. రెవె న్యూ, అటవీ శాఖలు సర్వే నిర్వహించి అర్హులకు పట్టాలు ఇవ్వాలని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సంతోష్, మాజీ మండల అధ్యక్షుడు శైలేందర్‌సింగ్, నాయకులు శ్రీధర్, శ్రీనివాస్‌గౌడ్, వెంకటేష్, పవన్‌కల్యాణ్ తది తరులు పాల్గొన్నారు. అనంతరం చిత్తాపూర్ గ్రామానికి చెందిన పెగడ సంతోష్, కొడిపె మహేందర్, శ్రీనివాస్, సాగర్ బీజేపీలో చేరారు. వారికి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహానించారు.