
తాత్విక‘ముని’కి కీర్తి పురస్కారం
నిర్మల్‌ఖిల్లా: ప్రముఖ తాత్విక కవి, రచయిత మునిమడుగుల రాజారావుకు సు రవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాల యం కీర్తి పురస్కారం లభించింది. ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు పురస్కారాలను అందిస్తోంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు బుధవా రం పురస్కార వివరాలను ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని జన్నారం మండలం తంగళ్ళపల్లికి చెంది న రాజారావు యుక్తవయసునుంచే సాహిత్య పఠ నం తాత్విక రచనల ద్వారా విశేషంగా పేరు గడించారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డా రు. అనాగరిక గేయం, నేను ఎవరు..?, దుఃఖ నది, హూ ఎమ్ ఐ, సత్యం వైపు పయనం వంటి అనేక రచనలతో సాహి తీ రంగంలో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. పలు రచనలు ఆంగ్లంలోనికి అనువాదమయ్యాయి. గతంలోనూ తన రచనల ద్వారా అనేక రాష్ట్ర, జాతీయస్థాయి పురస్కారాలను అందుకున్నారు. హైదరా బాద్‌లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో త్వరలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారంతో పాటు రూ.5,116 నగదు బహుమతి అందుకోనున్నారు.