
‘కాంగ్రెస్, బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీలు’
ఇచ్చోడ: కాంగ్రెస్, బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీలని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ నిషాని రాంచంద్రం ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కమిటీల పనితీరు, పార్టీ బలోపేతం విధివిధానాలను సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. 1950 నుంచి 93 వరకు బీసీలకు రాజకీయ, ఉద్యోగ రంగాల్లో ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల సతీశ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి రవీందర్, స్టేట్ ఈసీ మెంబర్ మెస్రం జంగుబాబు, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అధ్యక్షులు జగన్, ముల్కల రాజేంద్రప్రసాద్, రత్నపురం రమేశ్, తుకారాం, తదితరులు పాల్గొన్నారు.