
భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
భీమిని: భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. భూభారతిలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి అని తహసీల్దార్ బికార్ణదాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఖర్జీభీంపూర్ గ్రామానికి చెందిన గోకుల సునీత ఆర్వోఎఫ్‌ఆర్‌లో భూమి సాగు చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారని సీఎం పేషీలో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ భూమి వద్దకు సబ్ కలెక్టర్ ట్రాక్టర్‌పై తహశీల్దార్‌తో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ కార్యమ్రంలో ఆర్‌ఐ వెంకటేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.