
గర్భిణుల తరలింపు
వేమనపల్లి: భారీ వర్షాలు దృష్ట్యా శనివారం వేమనపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి రాజేష్ ఆధ్వర్యంలో లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను సు రక్షిత ప్రాంతాలకు తరలించారు. కళ్లెంపల్లి, జా జులపేట, సుంపుటం గ్రామాలకు చెందిన భారతి, శకుంతల, రోజును వేమనపల్లి పీహెచ్‌సీ నుంచి అంబులెన్స్‌లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్‌చార్జి హెల్త్ సూపర్‌వైజర్ రాంశెట్టి బాపు, ఏఎన్‌ఎం మంజుల, రాజ్యలక్ష్మి, ఈఎంటీ జనార్దన్, పైలెట్ సంపత్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కులం పేరుతో దూషించిన ఇద్దరిపై కేసు
జన్నారం: కులం పేరుతో దూషించిన ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై గొల్ల పెల్లి అనూష తెలిపారు. ఆమె కథనం ప్రకారం..లక్సెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రామంటెంకి శ్రీనివాస్‌కు జన్నారం మండలం రేండ్లగూడ శివారులోని సర్వేనంబర్ 158/4లో ఎకరం పొలం ఉంది. రేండ్లగూడకు చెందిన బాల్త రాజమౌళి ఈ పొలాన్ని దున్నించాడు. ఈనెల 13న రామటెంకి శ్రీనివాస్, తండ్రి రాజలింగుతో కలిసి అక్కడికి వెళ్లి తిరిగివస్తున్నారు. పాతకక్షలు మనస్సులో పెట్టుకుని బా ల్త రాజమౌళి, బాల్త భూమక్కలు శ్రీనివాస్, రా జలింగును కులం పేరుతో దూషించారు. శ్రీని వాస్ ఫిర్యాదుతో శనివారం ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని ఆత్మహత్య
కుంటాల: మండలంలోని లింబా(బి) గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గాండ్ల సాయినాథ్ (40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. సాయినాథ్‌కు గత 20 ఏళ్ల క్రితం రజితతో వివాహమైంది. ఇప్పటివరకు సంతానం కాలేదు. దివ్యాంగుడు కాగా, మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
మతిస్థిమితంలేని వృద్ధుడు
సిర్పూర్(టి): మండలంలోని నవేగాం గ్రామానికి చెందిన రాంటెంకి రుషి(60) శుక్రవారం పెన్‌గంగ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. రుషి గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దహెగాం మండలకేంద్రం శివారులో పత్తి చేనులో అతని బట్టలు దొరకగా శనివారం ఉదయం పెన్‌గంగ నదిలో మృతదేహం ఆచూకీ లభ్యమైంది. మృతుడి పెద్దనాన్న కుమార్తె యశోదాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అడవిపంది దాడిలో వ్యక్తి మృతి
భీమిని: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్నెపల్లి ఎస్సై భాస్కర్‌రావు, స్థానికులు తెలిపిన వివరాలు.. భీమిని మండలం వెంకటపూర్‌కు చెందిన దాగామ రామయ్య (70) కన్నెపల్లి మండలం సుర్జాపూర్ శివారులో శనివారం పత్తి చేనుకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో అడవి పంది దాడిలో అతడు గాయపడ్డాడు. పక్క చేనులో ఉన్న రైతులు గట్టిగా కేకలు వేయగా అది పరిగెత్తింది. రామయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. అక్కడి నుంచి వెళ్లిన అడవి పంది గురుండ్ల చిరంజీవి, మేకల బాపులపై దాడి చేసి గాయపర్చింది. ఫారెస్ట్ అధికారులు సిబ్బంది, మరికొందరితో కలసి పట్టుకునేందుకు వెళ్లగా అందులో ఒకరిని గాయపర్చినట్లు తెలిసింది. మృతుడి కుమారుడు రాజేశం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.