
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ
ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద పోటెత్తింది. శనివారం 1.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1083 అడుగులు ఉంది. 80.5 టీఎంసీలకుగాను 53.62 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ, మిషన్ భగీరథకు వదులుతున్నారు. గోదావరిలో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు. పశువుల, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు. – మామడ