
బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలు
రెబ్బెన: గోలేటిలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించే అంతర్ జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి పేర్కొన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా పురుషులు, మహిళల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. సుమారు 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులకు ఈనెల 17 నుంచి 21 వరకు సింగరేణి క్రీడామైదానంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ప్రతిభ చూపినవారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్‌రెడ్డి, భాస్కర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు చందర్ ఏఐటీయూసీ నాయకులు జగ్గయ్య, క్రీడాకారుడు నరేశ్ పాల్గొన్నారు.
శిక్షణ శిబిరానికి ఎంపిక
ఉమ్మడి జిల్లా పురుషుల జట్టుకు కె.సిద్దార్థ్, ఎం.తిరుపతి, పి.పవన్‌కుమార్, కె. తరుణ్, జి.గోపాల్, పి.శ్రీకాంత్, సాయి చరణ్, టి.దిలీప్‌కుమార్, పి.దేవరాజ్, ఎం.సూర్యకుమార్, ప్రేంకుమార్, సీహెచ్ గోపాలకృష్ణ, సీహెచ్ వరణ్ ఎంపికయ్యారు. మహిళల జట్టుకు ఏ.స్వప్న, కె.అంజలి, డి.శ్రావణి, జి.అనూష, కె.శ్రీస్పూర్తి కారుణ్య, టి.ప్రజ్వల శ్రీ, పి.వర్షిణి, సుజాత, సాయిదీక్ష, సంజన, అర్చన, వైష్ణవి, హారిక ఎంపికయ్యారు.