
వికసిత్ భారత్‌లో భాగస్వాములు కావాలి
మంచిర్యాలటౌన్: దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీ య జెండాను ఆవిష్కరించాలని, వికసిత్ భార త్ దిశగా మోదీ చేస్తున్న కృషిలో ప్రజలు భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి తిరంగా బైక్ ర్యాలీని పట్టణ వీధుల గుండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి, అమిరిశెట్టి రాజ్‌కుమార్, సత్రం రమేశ్, గాజుల ముఖేశ్‌గౌడ్, పట్టి వెంకటకృష్ణ, మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీశ్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, బొలిశెట్టి అశ్విన్, కోడి రమేశ్, ముదాం మల్లేశ్, రంగ శ్రీశైలం, బోయిని హరి కృష్ణ, జయరామరావు, సప్పిడి నరేశ్, కర్రె లచ్చన్న, కర్రె చక్రి, బోయిని దేవేందర్, కోడి సురేశ్ పాల్గొన్నారు.