ఇంటిస్థలం కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు | - | Sakshi
Sakshi News home page

ఇంటిస్థలం కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు

Aug 14 2025 7:45 AM | Updated on Aug 14 2025 7:45 AM

ఇంటిస్థలం కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు

ఇంటిస్థలం కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు

ఆదిలాబాద్‌రూరల్‌: మావల శివారు ప్రాంతంలోని సర్వేనంబర్‌ 170లో నకిలీ ఇంటి పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మావల పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన స్వామికి 2013 బీపీఎల్‌ కింద ప్రభుత్వం 905 నంబర్‌ గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో బాధితుడు స్వామి గుడిసె వేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం 2015లో అనుమతులు సైతం తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయాడు. రహెమాన్‌ఖాన్‌ ఆ స్థలంలో ఉన్న గుడిసెను తొలగించి వెంకటమ్మకు రూ. 2.30 లక్షలకు విక్రయించాడు. వెంకటమ్మ ఆ స్థలాన్ని కిష్టన్నకు రూ.3.50 లక్షలకు విక్రయించింది. బాధితుడు స్వామిని బెదిరింపులకు గురిచేయడంతో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో సుంకరి సంతోష్‌, రహిమాన్‌ ఖాన్‌, తాటి లక్ష్మణ్‌, కిష్టన్న, పవన్‌ నాయక్‌, సుంకరి వెంకటమ్మ, శరత్‌, వంశీకృష్ణపై కేసు నమోదు చేశా రు. ఇందులో నలుగురిని అరెస్టు చేయగా కిష్టన్న పవన్‌ నాయక్‌, సుంకరి వెంకటమ్మ, శరత్‌ పరారీలో ఉన్నారు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై..

నెన్నెల: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. కొందరు యువకులు బొప్పారం అడవిలో గంజాయి సేవిస్తున్నారని అందిన సమాచారం మేరకు వెంటనే దాడి చేయగా మంచిర్యాల గద్దెరాగడికి చెందిన ఐటీఐ విద్యార్థి పాల్తెపు ప్రణయ్‌ దొరికిపోయాడు. అతడిని సోదా చేయగా 1.5 గ్రాముల గంజాయి లభించింది. గంజాయితో పాటు పల్సర్‌ బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించారు. ప్రణయ్‌తో పాటు పారిపోయిన నెన్నెల మండలం గన్‌పూర్‌ గ్రామానికి చెందిన పోతురాజుల అకాశ్‌, గొల్లపల్లికి చెందిన సల్లూరి పెత్రుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

ప్లాట్‌ ఇస్తానని

మోసం చేసిన ఒకరిపై..

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ యజమాని సయ్యద్‌ షాహిద్‌పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ కె.నాగరాజు తెలిపారు. 2008లో నార్నూర్‌కు చెందిన ఎక్బాల్‌ ఖాన్‌ షాహిద్‌ వద్ద రూ.50 వేలకు ఆదిలాబాద్‌ పట్టణంలో ఓ ప్లాట్‌ కొనుగోలు చేశాడు. రూ.20వేలు అడ్వాన్స్‌ ఇవ్వగా రూ.30 వేలు కిస్తులుగా చెల్లించాడు. ఆ తర్వాత ప్లాట్‌ ఇవ్వకుండా 2016లో మరో వ్యక్తికి విక్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement