
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడిన వెన్నెల నారాయణ (51) చికి త్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడకు చెందిన నారాయణ మంగళవారం ఉదయం తన మోటార్ సైకిల్‌పై అడెల్లి పోచమ్మ దర్శనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో స్థానిక శర్మ దాబా వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారి రాజు, ఏఎస్సై రంగారావు తెలిపారు.
ఆగి ఉన్న లారీని ఢీకొని
సింగరేణి కార్మికుడు..
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రిలోని గాంధీనగర్‌కు చెందిన సాయి వెంకటేష్ (28) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు .శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే–7 గనిలో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటేష్ బైక్‌పై మంచిర్యాల నుండి మందమర్రి వైపు వెళ్తుండగా బొక్కలగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుని తండ్రి బానేష్ గతంలోనే అనారోగ్యంతో మృతి చెందగా తల్లి అన్నపూర్ణ అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
గూడ్స్ రైలు ఢీకొని ఒకరు..
సిర్పూర్(టి): ఆరెగూడ సమీపంలో డౌన్‌లైన్‌పై ఆపోజిషన్ డైరెక్షన్లో రైల్వే కాంట్రాక్ట్ లేబర్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గూడ్స్ రైలు రివర్స్‌లో వచ్చి ఢీకొనడంతో షేక్ జంషేద్ (44) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం 5.40 గంటలకు షేక్ జంషేద్, ప్రవీణ్, పర్వేస్ నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రవీణ్‌కు చేయి విరగడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగజ్‌నగర్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె.సురేష్ గౌడ్ విచారణ జరిపారు. షేక్ జంషేద్ మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఒకరిపై వేధింపుల కేసు
జైనథ్: అదనపు కట్నం కోసం వేధించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రంగ బాలరాజు గౌడ్ కుమార్తె స్రవంతికి అంకోలి గ్రామానికి చెందిన బాలాజీతో 2018లో వివాహమైంది. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో రెండు సంవత్సరాల క్రితం స్రవంతి పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. వారం రోజుల క్రితం బాలాజీ జైనథ్‌కు వచ్చి చంపుతానని బెదిరించడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు..