
అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్య
కాసిపేట: అప్పులబాధతో లారీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కాసిపేట పోలీస్‌స్టేషన్ పరి ధిలోని సోమగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ రంజాన్(41) ఇటీవల లారీని కొనుగోలు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్‌లో ఆర్టీసీ బస్సుతో యాక్సిడెంట్ అయిందని కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడ్డాడు. ఇప్పటికే అప్పుల పాలైన తాను యాక్సిడెంట్‌తో మరింత అప్పులు పెరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయి బుధవారం ఉదయం తన ఇంటిముందు రేకులకు లుంగీతో ఉరేసుకున్నాడు. మృతుని కుమారుడు హసన్‌బాబా ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని ఒకరు..
నేరడిగొండ: మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోలాంకి శ్రీకాంత్ (26) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చే సుకున్నట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ఫాస్టాగ్ తరహాలో
టైగర్ జోన్ ఎంట్రీ ఫీజు
కడెం: టోల్‌గేట్ మాదిరిగా ఫాస్టాగ్ తరహాలో చెక్‌పోస్ట్‌ల వద్ద సెస్ వసూలు చేసేందుకు అట వీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కవ్వాల్ టైగర్ జోన్ గుండా ప్రయాణించే వాహనాలకు చెక్ పోస్ట్‌ల వద్ద ఎన్విరాల్‌మెంట్ సెస్ వసూలు చేస్తున్నా రు. గతంలో టైగర్‌జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతులు లేవు. ఇటీవలే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. పాండ్వపూర్ లోని చెక్‌పోస్ట్ వద్ద టైగర్‌జోన్‌లోకి ఎంట్రీ అయ్యే వాహనాలు ఇప్పటి వరకు సిబ్బంది సెస్ వసూలు చేసేవారు. ఫాస్టాగ్ తరహాలో ఏర్పాటు చేయబోతున్న చెక్‌పోస్ట్‌తో వాహనదారులు వెంటవెంటనే వెళ్లేందుకు వీలుంది.