
కదిలే స్పీడ్ బ్రేకర్లు..!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో రోడ్ల పై పశువులు సంచరిస్తూ వాహనదారులకు ప్రాణసంకటంగా మారాయి. వాహనాల వేగా నికి ఒక్కసారిగా బ్రేక్‌లు వేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పాతమంచిర్యాల, నగరంలోని జాతీయ రహదారులపై పశువులు గుంపులుగా తిరుగుతున్నాయి. తోళ్లవాగు నుంచి శ్రీనివాసగార్డెన్, ఐబీ చౌరస్తా నుంచి వేంపల్లి, లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి బైపాస్ రోడ్డు మీదుగా వైశ్యాభవన్ వరకు పశువులు నిత్యం రోడ్లపై మకాం వేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. జిల్లా కేంద్రం కావడం, వివిధ ప్రాంతాల ప్రజలు పనుల నిమిత్తం వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 8న రాత్రి మంచిర్యాలలోని శ్రీనివాసకాలనీకి చెందిన శీకా మణిబాబుతోపాటు మరో నలుగురు ఓమిని వ్యాన్‌లో కరీంనగర్ నుంచి వస్తుండగా పాతమంచిర్యాల వద్ద రోడ్డుపై పడుకుని ఉన్న ఆవుని ఢీకొన్నారు. దీంతో వ్యానులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆవు యజమాని కార్తీక్‌పై మంచిర్యాల పోలీసుస్టేషన్‌లో 9న కేసు నమోదైంది. ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కార్పొరేషన్ అధికారులు స్పందించి పశువులు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కదిలే స్పీడ్ బ్రేకర్లు..!

కదిలే స్పీడ్ బ్రేకర్లు..!