● జిల్లాలో 37మిల్లీమీటర్ల వర్షపాతం ● కేంద్రాల్లో వేల క్
మంచిర్యాలఅగ్రికల్చర్: ఓ వైపు ఉరుములు, మెరుపులు, పిడుగులు, భారీ వర్షం. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉండడంతో రైతుల గుండెల్లో గుబు లు పుడుతోంది. ఇంటి వద్ద ఉండలేక పార పట్టుకుని కొనుగోలు కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. పైన, కింద ఎన్ని కవర్లు కప్పినా వరద ఆగడం లే దు. చేతికందిన పంటను చెడగొట్టు వాన దెబ్బతీ స్తోందని రైతులు కన్నీరు పెడుతున్నారు. వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో తమ పరిస్థితి ఏమిటంటూ ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో రెండ్రోజులుగా వర్షాలు వీడడం లేదు. బుధవారం నుంచి గురువారం వరకు 37మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, తాండూర్, భీమారం, జైపూర్, చెన్నూర్, మందమర్రి, కోటపల్లి, వేమనపల్లి, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎమ్మెస్ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు 6 వేల నుంచి 7 వేల క్వింటాళ్ల వరకు, ఆరబోసిన ధాన్యం 8 వేల నుంచి 9 వేల క్వింటాళ్లు తడిసిపోయింది. గురువారం ఉదయం ఎండ, ఉక్కపోత, మధ్యాహ్నం 3గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్ముకుని మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. 15నుంచి 20రోజులుగా సకాలంలో తూకం వేయక, లారీలు రాక ధాన్యాన్ని అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. వర్షాలకు ధాన్యం కొట్టుకుపోకుండా, తడవకుండా పడరాని పాట్లు పడుతున్నారు. గత శుక్ర, శనివారాల్లో కురిసిన వానతో అవస్థలు పడ్డామని, అయినా ధాన్యం సేకరణ వేగవంతం చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం మొలకలు వచ్చే పరిస్థితి నెలకొందని వాపోయారు.
జిల్లాలో వర్షపాతం..
జిల్లాలో గురువారం 37మిల్లీమీటర్ల వర్షపాతం నమోందైంది. మంచిర్యాల మండలంలో 64.6 మిల్లీమీటర్లు, హాజీపూర్‌లో 58.5, నస్పూర్‌లో 52.6, చెన్నూర్‌లో 50.7, దండేపల్లిలో 48.1, తాండూర్‌లో 44.8, జన్నారంలో 41.5, భీమారంలో 38, కాసిపేటలో 38.1, కోటపల్లిలో 36.8, జైపూర్‌లో 33.6, మందమర్రిలో 28.1, బెల్లంపల్లిలో 26.6, వేమనపల్లిలో 23.5, నెన్నెలలో 21.7, భీమినిలో 24.2, లక్సెట్టిపేటలో 24.2, కన్నెపల్లిలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


