
భావితరాలకు మెరుగైన సాగు భూములు అందిద్దాం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతులు సేంద్రీయ సాగు చేస్తూ భావితరాలకు మెరుగైన సాగు భూములు అందించాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ కోట శివకృష్ణ అన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం ర్యాలీలో హాజీపూర్ రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి నిరంతరం అండగా ఉంటామ ని అన్నారు. ప్రతీ రైతు సేంద్రీయ సాగువైపు మళ్లాలని తెలిపారు. పంటల మార్పిడి చేయాలని, పర్యావరణ పరిరక్షణలో రైతులు భాగస్వామ్యం కావా లని పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ అనిత, ఎఫ్‌పీఓ డైరైక్టర్లు పూస్కూరి శ్రీనివాసరావు, బొడ్డు శంకర్, మండల ఏఓ కృష్ణ, ఏఈఓలు మౌనిక, ఉదయ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం
కో ఆర్డినేటర్ డాక్టర్ శివకృష్ణ
ర్యాలీలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం