
వందశాతం అక్షరాస్యత సాధించాలి
● అదనపు కలెక్టర్ మోతీలాల్
కాసిపేట: వంద రోజుల్లో వంద శాతం అక్షరా స్యతను విజయవంతం చేస్తూ ప్రతి ఒక్కరూ అ క్షరాస్యులు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. శుక్రవారం రాత్రి మండలంలోని లంబాడితండాలో అక్షరాస్యత కేంద్రాన్ని సందర్శించి వయోజనులు అక్షరాలు నేర్చుకుంటున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాస్యతతోపాటు ఆర్థిక వెసులుబాటు లభించేలా కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వాలంటీర్లు ఐదుగురికి కుట్టు శిక్షణ ఇచ్చి వారి ద్వారా మరింత మందికి అక్షరాలు నేర్పిస్తామని అన్నారు. చ దువు సమాజంలో విలువను పెంచుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తంనాయక్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గప్రసాద్, ఎంపీడీవో స త్యనారాయణసింగ్, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఎల్‌డీఏం తిరుపతి, డీఆర్పీలు బండ శాంకరి, సుమన్, అశోక్‌రావు, మోడల్‌స్కూల్ అడిషనల్ ఏడీ శ్రీనివాసచారి, సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి, ఇన్‌స్ట్రక్టర్లు, వాలంటీర్లు, మహిళలు పాన్నారు.