
డెంగీ నివారణకు కృషి చేయాలి
నస్పూర్: డెంగీ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ అనిత, డాక్టర్ సుధాకర్‌నాయక్ అన్నారు. డెంగీ వ్యాధి ని వారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నస్పూర్‌లోని ప్రాథమిక అరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగీ నివారణలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పంచాయతీ, మున్సిపల్, ఆరో గ్య, సంక్షేమ శాఖలను భాస్వామ్యం చేయడం వల్ల దోమలను నిర్మూలించవచ్చని తెలిపారు. దీనివల్ల డెంగీ జ్వరం రాకుండా అరికట్టవచ్చని, డెంగీ ప్రాథమిక నిర్ధారణకు ఆయుష్మాన్ భవ, ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అనిల్‌కుమార్, సునిత, రమ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ శివప్రతాప్, ఆమన్ వెంకటేశ్వర్, సబ్ యూనిట్ అధికారులు నాందేవ్, జగదీష్, అల్లాడి శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేష్, సునిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.