మంచిర్యాలక్రైం: పదోన్నతితో విధుల్లో మరింత బాధ్యతలు పెరుగుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నా రు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీ స్‌స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తూ ఏఎస్సైగా పదోన్నతి పొందిన వారిని సో మవారం సీపీ కార్యాలయంలో అభినందించా రు. పదోన్నతి చిహ్నాం అలంకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ లో పదోన్నతి ద్వారా స్థాయితోపాటు బాధ్యత పెరుగుతుందని, క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, గౌ రవం పెంచే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం తదితరులు పాల్గొన్నారు.