దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలి

May 12 2025 12:17 AM | Updated on May 12 2025 12:17 AM

దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలి

దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలి

బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య

శ్రీరాంపూర్‌: ఈనెల 20న పలు జాతీయ కార్మి క సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కోరారు. నస్పూర్‌ కాలనీలోని యూనియన్‌ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధ వాతావరణం ఉన్న ఈ విపత్కర పరిస్థితిలో రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు తమ ఉనికిని చాటుకోవడం కోసం సమ్మెకు పిలుపు ఇవ్వడం సరికాదన్నారు. ఈ సమ్మెకు కార్మికులు మద్దతు ఇవ్వొద్దని కోరారు. దేశానికి అండగా నిలవాల్సిన ఈ సమయంలో దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా సమ్మె చేయవద్దని కోరారు. కార్యక్రమంలో యూని యన్‌ ప్రధాన కార్యదర్శి యతిపత్తి సారంగపాణి, శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు నాతా డి శ్రీధర్‌రెడ్డి, నాయకులు రాగం రాజేందర్‌, ఆకు ల హరి, రమేష్‌, బోయిన మల్లయ్య, జిల్లా తి రుపతి, గొల్ల మహేందర్‌, కిరణ్‌కుమార్‌, అరుణ్‌గౌడ్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement