ఆసుపత్రి పనుల పరిశీలన
మంచిర్యాలటౌన్: మంచిర్యాల కాలేజీరోడ్డులో 450 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మంచిర్యాలలో 450 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించారని, నాటి ప్రభుత్వ కృషి వల్లనే నూతన భవన నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, బేర సత్యనారాయణ, ఎర్రం తిరుపతి, శ్రీరాముల మల్లేశ్, వంగ తిరుపతి, పెంట నవీన్, జూపాక సుధీర్, నార్ల వంశీ, పడాల రవీందర్, నాయకులు పాల్గొన్నారు.


