
ముందస్తు రక్తపరీక్షలతో తలసేమియా నియంత్రణ
పాతమంచిర్యాల: మేనరిక వివాహాల నియంత్రణ, ముందస్తు రక్త పరీక్షలతో తలసేమియా వ్యాధిని నియంత్రించవచ్చని జిల్లా వైద్య, ఆరో గ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్‌రాజ్ అన్నారు. గురువారం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వద్ద తలసేమియా అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసేమియా వ్యాధి జన్యుపరమైనదని, తల్లిదండ్రులకు ఇద్దరికీ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉందని తెలి పారు. రక్తదానం తలసేమియా రోగులకు జీవాధారమని, తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ల డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్ అనిత, డాక్టర్ సుధాకర్‌నాయక్, ప్రోగ్రాం అధికారి అనిల్, జీజీహెచ్ ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీధర్, వైద్యాధికా రులు శివప్రతాప్, స్నేహిత, అశోక్, అమన్, రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులు భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మహేందర్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.