
ముగ్గురు నిందితుల రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని మహాలక్ష్మివాడలో గతనెల 28, 29 తేదీల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌కు చెందిన షేక్ మోబిన్, వాడే ఆకాష్, షిండే ఆకాష్ ఆది లాబాద్ మహాలక్ష్మివాడలోని మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. మరోసారి చోరీకి పాల్పడేందుకు బుధవారం జిల్లా కేంద్రానికి రాగా నిందితులను విచా రించడంతో సెల్‌ఫోన్, రూ.20వేల నగదు, 9 తులా ల బంగారం, 280 గ్రాముల వెండి అపహరించినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, ద్విచక్ర వాహనం, 2 తులాల బంగారం, 80 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. సమావేశంలో టూటౌ న్ సీఐ కరుణాకర్‌రావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ పాల్గొన్నారు.