స్వల్పంగా కంపించిన భూమి
జన్నారం/లక్సెట్టిపేట/దండేపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. సుమారు ఐదు సెకన్లపాటు కంపించినట్లు తెలుస్తోంది. జన్నారం మండలం తపాలాపూర్, పొనకల్ శ్రీలంక కా లనీ, రాంపూర్, ధర్మారం, కలమడుగు, చర్లపల్లి, జన్నారం, లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్, ఇటిక్యాల, లక్సెట్టిపేట, దండేపల్లి మండలం తాళ్లపేట, చింతపల్లి గ్రామాల్లో రాత్రి 6.50గంటల ప్రాంతంలో భూమి కంపించింది. పొనకల్ శ్రీలంకకాలనీలో ఉపాధ్యాయుడు జాడి రాజన్న టేబుల్‌పై గ్లాస్ పెట్టి కుర్చీలో కూ ర్చోగా గ్లాస్ కిందపడిందని, కుర్చీలో రెండు సె కన్లు కదిలిందని తెలిపారు. తపాలపూర్ గ్రా మంలో బోళ్ల స్టాండ్ నుంచి గ్లాసులు కింద పడినట్లు విజయధర్మ తెలిపారు. ఇళ్లలోని వస్తువులు అటు ఇటూ కదిలినట్లు అయ్యాయని పలు వురు తెలిపారు. ప్రకంపనలతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.


