ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
వేమనపల్లి: మండలంలోని ముల్కలపేట మత్తడివాగు నుంచి ఎలాంటి అనుమతి లే కుండా రాత్రివేళ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సోమవారం వేకువజామున పట్టుకున్న ట్లు నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ తెలిపారు. ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేతన్‌పల్లికి చెందిన ట్రాక్టర్ యజమానులు గురుండ్ల సంతోష్, చెన్నూరి సాలయ్య, డ్రైవర్ టకిరే పున్నంలపై కేసు నమోదు చేశామన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ప్రాణహిత నది, ఇతర వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.


