‘గడ్కరీ’ సభ విజయవంతం చేయండి
చెన్నూర్/మంచిర్యాలటౌన్: ఈ నెల 5న కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ క్రా స్ రోడ్డులో కాగజ్‌నగర్–శ్రీరాంపూర్ నాలుగు వరుస జాతీయ రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభ విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. శనివారం ఆయన చెన్నూర్‌లో, మంచిర్యాలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసిందన్నారు. జాతీయ రహదారి–363 నిర్మాణంతో రవా ణా సౌకర్యం మెరుగుపడిందని తెలిపారు. బహిరంగ సభకు జిల్లాలోని బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ కొయ్యల ఏమాజి, పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, గుండా ప్రభాకర్, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, బత్తుల సమ్మయ్య, తుమ్మ శ్రీపాల్, జాడి తిరుపతి, గర్రెపల్లి నర్సయ్య, కొండపాక చారి, కేవీఏం శ్రీనివాస్, బుర్ర రాజశేఖర్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


